AMARAVATHI

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా సోమవారం రాష్ట్ర బంద్-టీడీపీ

బంద్ పిలుపుకు జనసేనమద్దతు..
అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ పై ఆంధ్రప్రదదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి..టీడీపీ ఆందోళనలో భాగంగా సోమవారం ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపునిచ్చింది..ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు..‘‘40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టు, పార్టీ శ్రేణులపై జరిగిన దమనకాండ, జగన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపట్టాలని నిర్ణయించడం జరిగింది.. ప్రజాస్వామ్య రక్షణ కోసం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలి’’ అని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు..
బంద్ పిలుపునకు జనసేనమద్దతు:- తెలుగుదేశంపార్టీ రాష్ట్ర బంద్ పిలుపునకు జనసేనమద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు..ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ మీడియాతో మాట్లాడుతూ,,‘‘మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సోమవారం తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటిస్తోంది..ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన ఈ అరెస్టును జనసేన పార్టీ ఇప్పటికే ఖండించింది..రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా కంటక చర్యలకు పాలక పక్షం ఒడిగడుతోంది. ప్రజాపక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో వైసీపీ ప్రభుత్వం కేసులు, అరెస్టులతో వేధింపులకు పాల్పడుతోంది..ఈ అప్రజాస్వామిక చర్యలను జనసేన ఎప్పుడూ నిరసిస్తుంది..రేపు జరగబోయే బంద్ లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనాలి’’ అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *