AMARAVATHINATIONAL

ఉదయనిధి స్టాలిన్ కు సుప్రీంకోర్టు నోటీసులు

అమరావతి: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు,,క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ జస్టిస్ అనిరుద్ధ బోస్,,బేల ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం శుక్రవారంనాడు నోటీసులు పంపింది..సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా లాంటి రోగాలతో ఉదయనిధి పోల్చుతూ ఇటీవల మాట్లాడారు..సామాజిక ధర్మానికి సనాతన ధర్మం వ్యతిరేకమని, సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని అన్నారు..ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి..ప్రజలు పలు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు..ఆయన వ్యాఖ్యలపై FIR నమోదు చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలైంది..ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ఉదయనిధితో పాటు తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది..
వ్యాఖ్యలను వెనక్కి తీసుకోను:- దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్న సందర్బంలో మీడియా ప్రతినిధులు ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించగా,,సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి అంగీకరించలేదు..తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని, పర్యవసనాలను ఎదుర్కొనేందుకు సిద్ధమేనని అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *