గాల్లో వుండగానే విమానాల్లో సాంకేతిక లోపం-అత్యవసరంగా ల్యాడింగ్

అమరావతి: దేశంలో విమాన సేవలు అందిస్తున్న పలు సంస్థలకు చెందిన విమానుల్లో ఇటీవలి కాలంలో సాంకేతిక లోపాలు వరుసగా బయటపడుతున్నాయి.. మంగళవారం నాడు GO FIRST విమానయాన సంస్థకు చెందిన రెండు విమానాల్లో ఒకేసారి ఇంజన్ సమస్యలు చోటు చేసుకున్నాయి..శ్రీనగర్-ఢిల్లీ,, ముంబై-లేహ్ మధ్య నడుస్తున్న విమానాల్లో ఇంజన్లలో సమస్య ఏర్పడడంతో రెండు విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేశారు..ఈ సంఘటనపై సివిల్ ఏవియేషన్ రెగ్యులేటరీ (DGCA) విచారణ చేపట్టింది..మొదట GO FIRST ముంబై-లేహ్ విమానంలో ఇంజన్ నంబర్ 2లో లోపం కనిపించడంతో గమనించిన సిబ్బంది ఢిల్లీకి మళ్లించారని డీజీసీఏ అధికారులు తెలిపారు..ఇదే సమయంలో మరో విమానం గాల్లో ఉండగానే సమస్య ఏర్పడింది.. శ్రీనగర్-ఢిల్లీ విమానంలో కూడా నంబర్-2 ఇంజన్‌లో లోపాన్ని గుర్తించడంతో దీన్ని తిరిగి శ్రీనగర్‌కు మళ్లించారు..రెండు ఘటనల్లోనూ ప్రయాణీకులు,,న సిబ్బంది క్షేమంగా ఉండటం భారీ ఉరాటం ఇచ్చింది.. దీనిపై విచారణ జరుగుతోందని,, DGCA క్లియరెన్స్ వచ్చిన తరువాతే విమానాలు తిరిగి సేవలను ప్రారంభిస్తాయని అధికారులు తెలిపారు..దేశీయంగా సేవాలు అందిస్తూన్న విమానాల్లో వరుస లోపాల నేపథ్యంలో విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భద్రతా,,పర్యవేక్షణ నిమిత్తం విమానయాన సంస్థలు,, ఇతర మంత్రిత్వ శాఖ,, DGCA అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు..
(ఇతర దేశాల్లో వాడివేసిన విమానాలు తక్కువ ధరకు వస్తుండడంతో,దేశీయంగా విమాన సేవలు అందిస్తున్న సంస్థలు వీటిని కొనుగొలు చేసి,,నడిపిస్తున్నయనే వార్తాలు వున్నాయి..దేశీయంగా,అంతర్జాతీయంగా విమానసేవలు అందిస్తున్న ఒకటి,రెండు సంస్థలు మాత్రం,కొత్త విమానలు కొనుగొలు చేసి ఉపయోగిస్తున్నాయి..కొత్త విమానాలను నడిస్తున్న సంస్థలకు సంబంధించి ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురు కాడంలేదు..ఇదే సమయంలో పాతవిమానలను వినియోగిస్తున్న సంస్థలు తరుచు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి.వీటి కారణంగా ప్రయాణికు భద్రత అగమ్యగోచరంగా మారుతుంది..వరుసుగా చోటుచేసుకుంటున్న సంఘటనలపై విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.)