AMARAVATHIHYDERABAD

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,ఎం.పీ బండి.సంజయ్‌ను అర్థరాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,ఎం.పీ బండి.సంజయ్‌ను మంగళవారం దాదపు అర్థరాత్రి 12.30 గంటల సమయంలో కరీంనగర్‌లో అరెస్టు చేసిన పోలీసులు భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.. మంగళవారం రాత్రి 11.35 హైదరాబాద్ నుంచి కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లోని తన అత్తగారు మరణించడంతో,, కర్మకాండల కార్యక్రమంలో పాల్గొనేందుకు వారి నివాసానికి బండి సంజయ్ చేరుకున్నారు..అప్పటికే సిద్దంగా వున్న పోలీసులు,అయనను అరెస్ట్ చేశారు..తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటూ ప్రశ్నించిన బండికి,,పోలీసులు సమాధానం ఇస్తూ CRPC 151 సెక్షన్ క్రింద ఆరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు..బండి అరెస్ట్ వార్త తెలుసుకున్నబీజేపీ శ్రేణులు ఈ క్రమంలో భారీగా తరలిరావడంతో కొంత సేపు తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది..బుధవారం ఉదయం బండి.సంజయ్ ను వివిధ ప్రాంతాల్లో పోలీసుల వాహనల్లో తిప్పుతూ,,హనుమకొండ జిల్లా కోర్టు ముందుకు హజరు పర్చారు..

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై పోలీసులు కుట్ర కేసు నమోదు చేశారు..10th హిందీ పేపర్ వాట్సాప్ లో సంజయ్ మొబైల్ కు వచ్చిందని,,దింతో సంజయ్,రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర పన్నారని పోలీసులు సెక్షన్ 5 కింద కేసు వరంగల్ లో అయనపై కేసు నమోదైంది.

అర్ధరాత్రి తనను అరెస్టు చేయడంపై లోక్‌సభ స్పీకర్ కార్యాలయానికి బండి సంజయ్ ఫిర్యాదు చేశారు.. ఎలాంటి వారెంట్‌ లేకుండా అర్థరాత్రి తన ఇంట్లోకి అక్రమంగా చొరబడి అరెస్ట్‌ చేశారని స్పీకర్‌కు పంపిన ఫిర్యాలో పేర్కొన్నారు..

తెలంగాణలో పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది..బండి సంజయ్ అరెస్టుపై బీజెపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది..బండి సంజయ్ అరెస్టు గురించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరాతీశారు.. ఈ మేరకు తెలంగాణ బీజేపీ నేతలతో జేపీ నడ్డా మాట్లాడారు.న్యాయపరమైన అవకాశాలను పరిశీలించాల్సిందిగా నాయకులకు సూచనలిచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *