AMARAVATHI

తూర్పు తీరప్రాంతమైన విశాఖపట్నంకి ఒక ప్రత్యేక గుర్తింపు వుంది-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ప్రారంభలు,శంకుస్థాపనలు..

విశాఖపట్నం: భారతదేశంలో తూర్పు తీరప్రాంతమైన విశాఖపట్నంకి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నదని,ప్రాచీన కాలం నుంచే ఈ ఓడరేవు ద్వారా ప్రపంచం స్థాయిలో వాణ్యిజం జరిగేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. శనివారం ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ తన ప్రసంగంను తెలుగులో ప్రారంభించారు.ఈ సందర్బంలో ప్రధాని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారు. ఇక్కడి ప్రజలు దేశ, విదేశాల్లో ప్రతిభను కనబరుస్తున్నారు. టెక్నికల్, మెడికల్ రంగం ఏదైనా ఆంధ్రలు ప్రత్యేకతను కనబరుస్తున్నారు. తెలుగు ప్రజలు, అందరి బాగుకోసం పాటుపడతారని అన్నారు.

ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు సంక్షోభంలో ఉన్నాయి. కానీ భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. సంక్షోభంలో ఉన్న ప్రతిదేశం నేడు భారత్ వైపు చూస్తోందని ప్రధాని అన్నారు. దేశంలో సామాన్యుల ఆకాంక్షలు నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. వెనుకబడిన జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. వారికి అన్నివిధాల అండగా నిలిచేందుకు మరిన్ని పథకాలు విస్తరిస్తున్నామన్నారు. ఇప్పటికే ఉచితంగా బియ్యం అందిస్తున్నామని, పీఎం కిసాన్ ద్వారా రైతుల ఖాతాల్లో నిధులు వేస్తున్నామని ప్రధాని తెలిపారు. యువతకు అంకుర పరిశ్రమల్లో చేయూత అందిస్తున్నామన్నారు.

వందేభారత్ ట్రైయిన్-కేంద్ర మంత్రి వైష్ణవ్:- బహిరంగ సభలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో వందేభారత్ రైలు కల సాకారమైంది. త్వరలోనే ఆంధ్రలో కూడా వందేభారత్ రైలు సేవాలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎనిమిదేళ్ల కాలంలో భారతీయ రైల్వేలోని రైళ్లు, ప్లాట్ ఫాంలు, సౌకర్యాల కల్పన మరింత పెరిగిందని తెలిపారు.  రూ.466 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఆధునికీకరిస్తామని, రైల్వే స్టేషన్ లలో ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి అన్నారు.

ఈ వేదిక నుంచి రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు వర్చువల్​ విధానం ద్వారా మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు.1.రూ.2,658 కోట్లతో శ్రీకాకుళం-అంగుల్ నేచురల్ గ్యాస్ పైప్ లైన్,,2.రూ.3,778 కోట్లతో రాయపూర్-విశాఖ ఎకనామిక్ కారిడార్ లో 6 లేన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి..3.రూ.విశాఖ ఎన్.హెచ్-516పై కాన్వెంట్ జంక్షన్-షీలానగర్ జంక్షన్ వరకు 6 లేన్లు,,4.రూ.566కోట్లతో విశాఖ పోర్టు కనెక్టివిటీ కోసం ఆదనంగా 4 లైన్ల డెడికేటెడ్ పోర్టు రోడ్డు,,5.రూ.152 కోట్లతో విశాఖ పిషింగ హర్బర్ ఆధునికీకరణ,,6.రూ.460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ రెన్యూవేషన్ కు శంకుస్థాపన,,7.ఓఎన్.సీ-యుఫీల్డ్ ఆన్ షోర్ సదుపాయాలు జాతికీ అంకితం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *