AMARAVATHINATIONAL

హిందూ ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించడమే ప్రతిపక్షపార్టీల కూటమి అజెండా-బీజెపీ

అమరావతి: సనాతన ధర్మం అంటే మలేరియా,, డెంగీ వ్యాధుల లాంటిదంటూ,, దాన్ని నిర్మూలించాలంటూ తాను చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతున్న నేపధ్యంలో, తమిళనాడు సీ.ఎం స్టాలిన్ కుమారుడు,,DMK పార్టీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు..శనివారం తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ‘సనాతన ధర్మం గురించి ఇటీవల నేను మాట్లాడాను..మొన్న నేను చెప్పింది మళ్లీ మళ్లీ చెబుతూనే ఉంటాను అంటూ స్పష్టం చేశాడు..

సనాతన ధర్మం’పై తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, డీఎంకే లీడర్ ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నాయి..పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు అతని వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు..ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసమే ప్రతిపక్షలకు చెందిన ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని అవమానించిందని అమిత్ షా,,రాజ్ నాధ్ సింగ్ తో పాటు ఇతర బీజేపీ నాయకులు వ్యాఖ్యలు తీవ్రంగా స్పందించారు..హిందూ ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించడమే ప్రతిపక్షపార్టీల కూటమి(ఇండియా) ప్రాథమిక ఎజెండా అని బీజెపీ ధ్వజమెత్తింది..ఉదయనిధిపై తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *