AMARAVATHITECHNOLOGY

జాబిల్లిపై మరోసారి సాఫ్ట్ ల్యాండింగ్ అయిన విక్రమ్ ల్యాండర్-ఇస్రో

అమరావతి: ఇస్రో శాస్త్రవేత్తలు తాజాగా విక్రమ్ ల్యాండర్ పై ఒక చిన్న ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.. హాప్ (HOP) ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ కు సిగ్నల్స్ పంపంగా,,అది దాని ఇంజిన్లను మండించి,, సుమారు 40 సెంటిమీటర్ల వరకు గాల్లోకి లేచి, కొద్ది దూరంలో మళ్లీ సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి..ఈ ప్రయోగం విజయవంత కావడంతో విక్రమ్ ల్యాండర్, జాబిల్లిపై మరోసారి సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యిందని సోషల్ మీడియా వేదికగా ఇస్రో తెలిపింది..ఈ ప్రయోగం తర్వాత అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేస్తున్నాయని వెల్లడించింది..ఈ ప్రయోగం భవిష్యత్ లో మానవ సహిత ప్రయోగానికి ఎంతో ఉపయోగ పడుతుందని తెలియచేసింది..విక్రమ్ ల్యాండర్ నేడు 08:00 గంటలకు స్లీప్ మోడ్ లోకి వెళ్లనుందని,,అయితే స్లీప్ మోడ్ లోకి వెళ్లక ముందే ChaSTE, RAMBHA-LP,,ILSA పేలోడ్ ల ద్వారా in-situ ప్రయోగాలు కొత్త ప్రదేశంలో నిర్వహించబడతాయని,,అవి సేకరించిన డేటా భూమికి పంపిస్తాయని తెలిపింది..ప్రస్తుతానికి పేలోడ్స్ స్విచ్ ఆఫ్ చేయబడ్డాయని, ల్యాండర్ రిసీవర్స్ మాత్రం ఆన్ లోనే ఉంచడం జరిగిందని ఇస్రో పేర్కొంది..సోలార్ పవర్ తగ్గి, బ్యాటరీ డిస్ చార్జీ అయిన తరువాత ప్రజ్ఞాన్ రోవర్ పక్కనే ల్యాండర్ స్లీప్ మోడ్ లోకి వెళ్లుతుందన్నారు..సెప్టెంబర్ 22వ తేదీన విక్రమ్ ల్యాండర్,, ప్రజ్ఞాన్ రోవర్లు తిరిగి మేల్కొంటాయని ఆశిస్తున్నామని ఇస్రో ఆశాభావం వ్యక్తం చేసింది.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *