AMARAVATHIDISTRICTS

శ్రమదానంలో భాగస్వాములు కండి- కమిషనర్ వికాస్ మర్మత్

నెల్లూరు: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన “స్వచ్ఛతా హీ సేవా” కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 1వ తేదీ చేపడుతున్న శ్రమదానంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ శనివారం కోరారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ వ్యర్ధాల నుంచి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని సూచించారు. పరిశుభ్రత ద్వారా అభివృద్ధి అన్న ఆశయంతో నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో వీధులను చిమ్మడం, డ్రైను కాలువల్లో పూడికతీత, సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. గాంధీ మహాత్మునికి నివాళిగా “స్వచ్ఛ హీ సేవా” లో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక గణేష్ ఘాట్, ఇరుకళల పరమేశ్వరి గుడి దగ్గర, నెల్లూరు బ్యారేజ్  తిక్కన పార్కు పరిసర ప్రాంతాల్లో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక సంస్థ గౌరవ మేయర్ శ్రీమతి స్రవంతి, డిప్యూటీ మేయర్లు,కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారని,,కార్పొరేషన్ లోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొనాలని కమిషనర్ కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *