AMARAVATHI

జగన్ బెయిల్ పిటీషన్ రద్దుపై నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి,, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది..సీఎం జగన్ బెయిల్ పిటీషన్ రద్దుపై ఎంపీ రఘురామరాజు సుప్రీకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు..ఇప్పటికే జగన్ పై నమోదు అయిన కేసులు ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ తో పాటు బెయిల్ రద్దు పిటీషన్ ను కలపి జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది..ఈ విచారణలో భాగంగా జగన్, సీబీఐకి నోటీసులు ఇస్తూ తదుపరి విచారణ జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది..
రఘురామ రాజు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ నిర్వహించిన సందర్బంలో సాక్ష్యాలు చెరిపేస్తున్నారని ఆనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని రఘురామరాజు తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ ను ధర్మాసనం ప్రశ్నించింది..అయన సమాధానం ఇస్తూ కేసు పూర్వాపరాలు, జరిగిన ఘటనలపై వివరాలను లిఖితపూర్వకంగా కోర్టుకు అందం చేశారు..జగన్ కు బెయిల్ మంజూరు చేసిన తరువాత దర్యాప్తు సంస్థలు ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు..ఇదే వ్యవహారంలో, కేసు ట్రయల్ ను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని తాము దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్ ఉందని, దానిలో ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లు కోర్టుకు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ తెలిపాడు.. హైకోర్టులో కేసు కొట్టివేసిన తరువాత ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కూడా ఇటీవల సుప్రీంకోర్టుకు వచ్చినట్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లాడు.. ఆ పిటీషన్ కూడా ఇదే ధర్మాసనం వద్ద పెండింగ్ లో ఉన్నదని కోర్టుకు తెలిపారు..
రఘురామ తరపు న్యాయవాది వాదనలు ఆలకించిన ధర్మాసనం,, ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా? అంటూ ప్రశ్నించింది..నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామ న్యాయవాది కోర్టుకు తెలిపాడు.. విచారణను హైదరాబాద్ నుంచి మార్చాలన్న పిటిషన్, ఈడి దాఖలు చేసిన పిటిషన్ కు బెయిల్ రద్దు పిటిషన్ ను జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *