హైదరాబాద్: అతనొస్తే పూనకాలన్నారు…? అడుగేస్తే అరాచకం అన్నారు..? మరేంటి ఇంకా సౌండే లేదేంటని అనుకుంటున్నారా..? ఇలాంటి మాస్ పదాలతో దిమ్మతిరిగే అప్డేట్ వాల్తేరు వీరయ్య నుంచి వచ్చింది.. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమానుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ నేడు విడుదల అయింది..మెగా అభిమానులు,,,మాస్ రాజా ఫ్యాన్స్ కోరుకునే అని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది..చాలా కాలం తర్వాత మెగాస్టార్ కంప్లీట్ మాస్ రోల్ లో కనిపించనున్నారు..వాడు నా ఎర.. నువ్వే నా సొర, రికార్డులో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డులు ఉంటాయి.. అంటూ చిరంజీవి చెప్పిన డైలాగులు ఫ్యాన్స్ ఉపేస్తున్నాయి..ఇక రవితేజ చెప్పిన సరైన వేటగాడు లేక ఇక్కడ ఒక పులి పూనకంతో ఊగిపోతుందట.. అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది..ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.