AMARAVATHITECHNOLOGY

చాట్‌ జీపీటీ వినియోగం మంచిదే, కానీ ఇది అలసత్వానికి దారి తీయకూడదు-ప్రధాని మోదీ

బిల్ గేట్స్‌ తో ముచ్చట్లు..

అమరావతి: మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్‌,, ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ చ‌ర్చ‌లో పాల్గొన్నారు.. ప్ర‌ధాని మోదీ నివాసంలో ఆ చ‌ర్చా కార్య‌క్ర‌మం జ‌రిగింది..ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(AI) నుంచి డిజిట‌ల్ ప‌బ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌,, వాతావ‌ర‌ణ మార్పులు లాంటి పలు అంశాల‌పై చ‌ర్చించారు..టెక్నాల‌జీని భార‌తీయుల చాలా వేగంగా ఆందుకున్నార‌ని చ‌ర్చ‌ల సందర్బంలో భార‌తీయ‌ల‌ను బిల్ గేట్స్ ప్ర‌శంసించారు..సాంకేతిక రంగంలో భార‌త్ దూసుకెళ్తున్న‌ట్లు బిల్ గేట్స్ వెల్లడించారు..పీఎం న‌మో యాప్‌లో ఉన్న ఫోటో బూత్ ఆప్ష‌న్ ద్వారా బిల్ గేట్స్‌తో ప్ర‌ధాని సెల్ఫీ దిగారు..డిజిటిల్ విప్ల‌వంలో ఇండియా వేగంగా ముందుకు వెళ్తోంద‌ని, ఆరోగ్యం, వ్య‌వ‌సాయం, విద్యా రంగాల్లో కూడా భార‌త్ ముందుకు వేగంగా అడుగుతలు వెస్తొంద‌ని ప్రధాని మోదీ అన్నారు..చాట్‌ జీపీటీ వినియోగం మంచిదే, కానీ ఇది అలసత్వానికి దారి తీయకూడదని ప్రధాని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు..ఇండోనేషియాలో G20 శిఖ‌రాగ్ర స‌ద‌స్సు జ‌రిగిన స‌మ‌యంలో భార‌త్‌లో జ‌రుగుతున్న డిజిట‌ల్ విప్ల‌వం గురించి ప్ర‌పంచ దేశాలు త‌మ ఉత్సుక‌త‌ను ప్ర‌ద‌ర్శించాయ‌ని,,దేశంలో అయితే ఏక‌ఛ‌త్రాధిప‌త్యాన్ని నిర్మూలించేందుకు టెక్నాల‌జీని ప్ర‌జ‌ల చేత‌, ప్ర‌జ‌ల కోసం మార్చామ‌ని ఆ స‌ద‌స్సులో చెప్పిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు.. G20 స‌ద‌స్సు స‌మ‌గ్ర స్థాయిలో ఇండియా స‌ద‌స్సును అద్భుతంగా నిర్వహించింద‌ని బిల్ గేట్స్ పేర్కొన్నారు.. విద్యారంగంలో మార్పుల‌కు టెక్నాల‌జీ వినియోగిస్తున్నామ‌ని,, ఇందులో బాగంగా స్కూల్ టీచ‌ర్ల కొర‌త‌ను అధిగ‌మించేందుకు AIను వాడుతున్నామ‌ని,, డిజిట‌ల్ మార్పుల‌తో దేశానికి ప్ర‌యోజ‌నం చేకూరుతొందని ప్రధాని మోదీ అన్నారు..చిరుధాన్యాల సాగుతో చిన్న రైతులు అభివృద్ధి చెంద‌తున్నార‌ని,,ఇదే సమయంలో పెద్ద హోట‌ళ్ల‌లోనూ చిరుధాన్యాల వంట‌కాలు పెరిగాయ‌న్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *