జడ్పీ సమావేశాలు కేవలం మొక్కుబడిగా కాకుండా?-మంత్రి కాకాణి

రెండు సం.. పూర్తి చేసుకున్న కలెక్టర్ కు అభినందనలు..
నెల్లూరు: రైతు సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయ రంగంలో తీసుకుంటున్న విప్లవాత్మక మార్పులతో దేశం మొత్తం మన రాష్ట్రం వైపే చూస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి.గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జడ్పీ సమావేశాలు కేవలం మొక్కుబడిగా కాకుండా సమస్యల పరిష్కారం కొరకు సభ్యులందరూ కృషి చేయాలన్నారు. సభ్యులకు సమయపాలన చాలా ముఖ్యమని సూచించారు. ప్రస్తుత సమావేశంలో సభ్యులు వెలిబుచ్చిన సమస్యలను అధికారులు తీసుకున్న చర్యల నివేదికను తదుపరి సమావేశంలో తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని సభ్యులకు హామీనిచ్చారు..చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ అధ్యక్షతన నిర్వహించారు..జిల్లా కలెక్టర్ గా ఉత్తమ పాలన అందిస్తూ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబును చైర్ పర్సన్ అభినందించారు..అదేవిధంగా జిల్లాలోని ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నికల్లో గెలుపొంది మొట్టమొదటిసారిగా జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డిని చైర్ పర్సన్ అభినందించారు..సందర్బంలో జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ మాట్లాడుతూ స్వతంత్ర భారతావని 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జిల్లా ప్రజలందరూ ఆగస్టు 11 నుండి 17 వరకూ తమ ఇంటి పై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రజలకు సూచించారు..