AMARAVATHINATIONAL

భారత్ దేశం అన్ని రంగాల్లో పురోగతి చెందుతోంది-బిల్ గేట్స్

అమరావతి: భారత్ దేశం అన్ని రంగాల్లో పురోగతి చెందుతోందని, దేశాన్ని సందర్శించడం ఎంతగానో స్ఫూర్తి కలిగిస్తోందని టెక్ దిగ్గజం, మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యనించారు..ప్రపంచమంతా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో భారతదేశం లాంటి ఓ సృజనాత్మక,,వేగంగా నిర్ణయాలు తీసుకొనే దేశాన్ని సందర్శించడం తనకు ఎంతగానో స్ఫూర్తి కలిగిస్తోందని బిల్ గేట్స్ పేర్కొన్నారు..భారతదేశంలో పర్యాటిస్తున్న గేట్స్,శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం గురించి,, భారతదేశం అభివృద్ధి చెందుతున్న తీరును బిల్ గేట్స్ తన అధికారిక బ్లాగ్ “గేట్స్ నోట్స్”లో ప్రస్తావించారు..ప్రధాని నరేంద్రే మోదీ నేతృత్వంలో కరోనా సమయంలో వ్యాక్సిన్లు పెద్దమొత్తంలో సరఫరా చేసి లక్షలాది మంది ప్రాణాలను కాపాడటమే కాకుండా,, ఇతర దేశాలకు అందించి స్నేహబంధాన్ని చాటుకుందని ప్రశంసించారు..కొవిన్ యాప్,,,,ప్రపంచానికి ఓ మోడల్ అవుతుందని ప్రధాని మోదీ విశ్వసించారని,, దాన్ని నేనూ కూడా అంగీకరిస్తున్నానని గేట్స్ వ్యాఖ్యనించారు.. కరోనా మహమ్మారి కారణంగా తాను గత మూడు సంవత్సరాలు ప్రయాణాలు చేయనప్పటికీ అదే సమయంలో ప్రధాని మోదీతో ప్రత్యేకంగా కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి గురించి మాట్లాడానని బిల్ గేట్స్ మననం చేసుకున్నారు..కరోనా సమయంలో భారతదేశం 200 మిలియన్ల మంది మహిళలతో సహా 300 మిలియన్ల మందికి అత్యవసర డిజిటల్ చెల్లింపులను చేసిందని బిల్ గేట్స్ పేర్కొన్నారు..ప్రభుత్వాలు ఆశించిన మేర పనిచేయడానికి డిజిటల్ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ అన్నారు..జీ-20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడంపై గేట్స్ వ్యాఖ్యనిస్తూ, దేశంలోని నూతన ఆవిష్కరణల నుంచి ప్రపంచ ఎలా ప్రయోజనం పొందొచ్చో చెప్పేందుకు ఇది గొప్ప అవకాశం అని బిల్ గ్రేట్స్ తెలిపారు..భారత్ తన ఆవిష్కరణలను ప్రపంచంతో పంచుకోవాలని ఆశిస్తున్నానని గేట్స్ తన బ్లాగ్ లో భారత్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *