CRIMENATIONAL

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవరెడ్డి అరెస్ట్

అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఒంగొలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి,కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు శనివారం ఉదయం అరెస్ట్ చేశారు..సౌత్ లిక్కర్ గ్రూప్‌లో మాగుంట రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించినట్టు ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది..లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిండికేట్ అధ్వర్యంలో జరిగిన అన్ని సమావేశాల్లో మాగుంట.రాఘవరెడ్డి పాల్గొన్నట్టు పక్కా ఆధారలు లభించాయి..ఈడీ విచారణలో రాఘవరెడ్డి చాలా సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది..శుక్రవారం నుంచి రాఘవరెడ్డిని విచారించిన ఈడీ అధికారులు సాయంత్రం అదుపులోకి తీసుకున్నప్పట్టికి,, శనివారం ఉదయం అధికారికంగా మాగుంట రాఘవరెడ్డి అరెస్ట్‌ ను ప్రకటించారు.. అయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను రోస్ అవెన్యూ సిబిఐ కోర్టులో హాజరు పర్చి,,5 రోజులు కస్టడీకీ కోరే అవకాశం వుంది..

అమిత్ ఆరోరా,,దినేష్ ఆరోరా,,ఆర్జున్ పాండే స్టేట్ మెంట్స్ తో దర్యాప్తు చేసిన ఈడీ,,వెలుగులోకి వచ్చిన విషయాలను ఆధారంగా చేసుకుని,మాగుంట. రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు..సౌత్ హౌస్ గ్రూప్ లో మాగుంట.శ్రీనివాసులరెడ్డి,, రాఘవరెడ్డిలు కీలకమైన పాత్ర ఫోషించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంయినట్లు సమాచారం..సౌత్ కు చెందిన లిక్కర్ వ్యాపారులు దాదాపు రూ.100 కోట్లు ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.. అందుకు ప్రతిఫలంగా 32 జోన్స్ లో నిబంధనలు ఉల్లఘించి,,వీరికి లైసెన్స్ లు ఇచ్చినట్లు ఈడీ కనుగొన్నది ..ఏ సంస్థ అయిన 2 కంటే ఎక్కవ రిటైల్ జోన్స్ లు తీసుకోకూడదు..అయితే నిబంధనల్లోని వున్న కొన్ని లోసుగులను ఉపయోగించుకుని,,రెండు కంటే ఎక్కువ రిటలై షాపులను వీరు నిర్వహిస్తున్నారు…మనీ ట్రాన్స్ క్షన్స్,ఎవరి ద్వారా ఎలా జరిగాయి అనే దానిపై ఈడీ ఒక రూట్ మ్యాప్ ను తయారు చేసింది.. ఈ స్కామ్‌ కేసులో రెండు రోజుల క్రితం న్యూఢిల్లీ కేంద్రం పని చేసే చారియట్‌ మీడియాకు చెందిన రాజేశ్‌ జోషి అనే వ్యక్తిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు..రాజష్ జోషి అనే వ్యక్తి అడ్వటైజ్ సంస్థలకు అధిపతి,,అతని ద్వారా నగదును అమ్ ఆద్మీపార్టీకి తరలించారని,,ఇందులో విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించాడని ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది..ఈ డబ్బును కేజ్రీవాల్,,గోవా ఎన్నికల్లో ఉపయోగించరని ఈడీ బయటపెట్టింది.త్వరలో తెలుగు రాష్ట్రల్లో మరిన్ని పెద్ద తలకాయల అరెస్ట్ లు జరిగే అవకాశం వున్నట్లు తలుస్తొంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *