AMARAVATHICRIME

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌ బాంబు పేలుడు కేసులో అనుమానితుడు అరెస్ట్

అమరావతి: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో ఈ నెల 1వ తేదిప బాంబు పేలుడు కేసుకు సంబంధించి NIA అధికారులు బళ్లారికి చెందిన సయ్యద్.షబ్బీర్‌ ను బుధవారం వేకవజామున 4 గంటలకు అదుపులోకి తీసుకున్నారని సమాచారం..రామేశ్వరం బాంబు కేసుతో ఇతనికి సంబంధం ఉందనే అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తొంది..

NIA అదుపులోకి తీసుకున్న సయ్యద్.షబ్బీర్‌ తొరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. మార్చి 1వ తేదీ ఉదయం 9:10 గంటలకు బుడా కాంప్లెక్స్ సమీపంలో అనుమానిత ఉగ్రవాదిని షబ్బీర్‌ కలవడంతో పాటు అనుమానితుడితో ఫోన్ కాల్స్ కూడా మాట్లాడినట్లు NIA అధికారులు కనుగొన్నట్లు తెలియ వచ్చింది..

బాంబు పేలుడు అనుమానితుడు,, తన అన్నయ్య పిల్లల ద్వారా పరిచయమయినట్లు సయ్యద్.షబ్బీర్‌ తెలిపినట్లు సమాచారం.. షబ్బీర్ అతని వివరాలను NIA అధికారులకు ఇచ్చినట్లు తెలుస్తోంది.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తన్న పోలీసులకు,, బళ్లారి కొత్త బస్ స్టేషన్ నుంచి అగంతకుడు బుడా కాంప్లెక్స్‌కు ఆటోలో వచ్చి షబ్బీర్ కలిసినట్లు కనుగొనడంతో షబ్బీర్‌ను అరెస్ట్ చేశారు.

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటనకు సంబంధించి NIA అధికారులు ఇటీవల కీలక ప్రకటన చేశారు.. బాంబు పెట్టాడని భావిస్తున్న అనుమానిత వ్యక్తి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *