AMARAVATHINATIONAL

ఢిల్లీలో ముగిసిన G-20 దేశాల సదస్సు

మహాత్మా గాంధీకి నివాళులు..

అమరావతి: ఢిల్లీలో రెండురోజు పాటు జరిగిన G-20 సదస్సు ఆదివారం రోజున ముగిసింది..రష్యా, ఉక్రెయన్ యుద్ధం నేపథ్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ జరిగినటువంటి ప్రార్థనలతో సదస్సు ముగిసిందని ప్రధాని మోదీ వెల్లడించారు.. G-20 సదస్సు ముగిసినట్లు ప్రకటిస్తున్నానని,,వసుధైక కుటుంబానికి రోడ్ మ్యాప్ దిశగా మనం ముందుకు సాగుతామని ఆకాంక్షిస్తున్నట్లు మోదీ తన ముగింపు ఉపన్యాసంలో పేర్కొన్నారు..అనంతరం G-20 అధ్యక్ష అధికార దండాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూలా డిసిల్వాకు ప్రధాని మోదీ అందజేశారు..ఈ సదస్సులో చర్చించిన అంశాలపై సమీక్ష జరిపేందుకు ఈ సంవత్సరం నవంబర్ నెల చివర్లో వర్చువల్ సమావేశం జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదన చేశారు..G-20 సదస్సులో చర్చకు వచ్చిన సూచనలు, అంశాలపై చర్యలు, పురోగతిని సమీక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
మహాత్మా గాంధీకి నివాళులు:- G-20 దేశాధినేతలు మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు..అదివారం G-20 సమావేశానికి ముందు ఢిల్లీలోని రాజ్ ఘాట్ కి వెళ్లిన నేతలు మహాత్ముని సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు..వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా గాంధీజీకి పుష్పాంజలి ఘటించి,,శాంతి గోడ’పై సంతకాలు చేశారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *