AMARAVATHIDISTRICTS

అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అధికార దుర్వినియోగం పాల్పపడ్డారు-అజీజ్

ఏఏజీ వైసిపి ప్రచార కార్యదర్శిగా చేరాలి..

నెల్లూరు: అడిషనల్ ఏజీగా ఉన్న పొన్నవొలు సుధాకర్ రెడ్డి ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ ప్రతిపక్ష నేతను దొరికిన దొంగ అని మాట్లాడటం అధికార దుర్వినియోగం అబద్ధాలకు పరాకాష్టగా ఉందని నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మండిపడ్డారు..గురువారం అయన ఒక ప్రకటన విడుదల చేశారు.. ప్రజా ఖజానాను లూటీ చేసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని,,చంద్రబాబు కాదని చెత్త పన్నుతో సహా అనేక పన్నులు,  కరెంటు బస్సు చార్జీలతో సహా అనేక ధరలను విపరీతంగా పెంచారని పెంచిన లక్షల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని నవరత్నాలు నవ మోసాలయ్యాయని ప్రభుత్వ ఖజానాను జగన్ ముఠాలు లూటీ చేయడం వల్లే రాష్ట్రం గతుకుల రోడ్ల మయమైందని ఆరోపించారు.. స్కిల్ కేసులో మొదట 3 వేల కోట్ల అన్నారని తర్వాత మాట మార్చి 370 కోట్ల అన్నారని తిరిగి మాట మార్చి 27 కోట్లు అన్నారని దేనికి రుజువు చూపలేదని హైకోర్టు వ్యాఖ్యానించిని విషయంను అయన గుర్తు చేశారు..తక్కువ ఖర్చుతో 2.15 లక్షల మందికి స్కిల్ ద్వారా ఉద్యోగాలు కల్పించినందుకు చంద్రబాబుపై కేసు పెట్టారా అని ప్రశ్నించారు. బైజుస్ లో సాఫ్ట్వేర్ కి వేల కోట్లు ఎలా ఖర్చు చేశారని బైజుస్ టెండర్లు, క్యాబినెట్ అప్రూవల్ లేవని, 1200 కోట్ల కుంభకోణం జరిగిందని అన్నారు. స్కిల్ కు క్యాబినెట్ అప్రూవల్, టెండర్లు ఉన్నాయని చట్ట ప్రకారం జరిగింది అవినీతి ఎలా అవుతుందని జగన్ రెడ్డి తన లూటీ నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టారని సుప్రీంకోర్టు సీనియర్ జడ్జ్ 17A వర్తిస్తుందని తీర్పు చెప్పారని FIR క్వాష్ కు పాక్షిక విజయం వచ్చిందని అన్నారు..అధికారుల్ని ప్రతిపక్షాన్ని బెదిరిస్తొంది… అక్రమ కేసులు పెడుతున్నది జగన్ ప్రభుత్వమేనని సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించిన పంచ్ ప్రభాకర్ రెడ్డిని కాపాడుతున్నది కూడా జగన్ ప్రభుత్వమేనని అన్నారు. 74 సంవత్సరాల వయసున్న చంద్రబాబుకు జైల్లో సౌకర్యాలు కల్పించింది కోర్టు ఆదేశాలే గాని జగన్ ఉదారత్వం కాదని 43 వేల కోట్ల కుంభకోణంలో ఉన్న జగన్ 16 నెలలు జైల్లో భోగాలు అనుభవించారని చంద్రబాబు మూలాఖత్కు కూడా ఆంక్షలు పెట్టారని అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *