AMARAVATHIMOVIE

69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్

తెలుగు ఉత్తమ చిత్రంగా ”ఉప్పెన”
అమరావతి: 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల వివరాలను కేంద్ర సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ లో ప్రకటించారు..నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023కి గాను 28 భాషల్లో మొత్తం 280 చలనచిత్రాలు, 23 భాషలలో 158 నాన్-ఫీచర్ ఫిల్మ్ లు పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు..
విజేతలుగా నిలిచిన చిత్రాలు, నటులు, టెక్నీషియన్లు:- ఉత్తమ చిత్రం ఉప్పెన,,జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ (పుష్ప),,ఉత్తమ నటి అలియా భట్ (గంగూభాయి కాఠియావాడి), కృతిసనన్ (మిమి),,బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ కాలభైరవ (కొమురంభీముడో..),,ఉత్తమ వినోదాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్,,ఉత్తమ కొరియోగ్రఫీ ఆర్ఆర్ఆర్ (ప్రేమ్ రక్షిత్),,బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ (పుష్ప),,బెస్ట్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (కీరవాణి),,ఉత్తమ లిరిక్స్ కొండపొలం (చంద్రబోస్),,క్రిటిక్స్ స్పెషల్ మెన్షన్ ఫిల్మ్-సుబ్రమణ్య బాదూర్ (Kannada),,బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ – పురుషోత్తమ చార్యులు (Telugu),,బెస్ట్ బుక్ ఆన్ సినిమా-ది ఇన్ క్రీడిబుల్ మెలోడియస్ జర్నీ (రచయిత రాజీవ్ విజయకర్)..
నాన్-ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ప్రధాన విజేతలు:-ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్-ఏక్ థా గావ్ (గర్హ్వాలి & హిందీ),,
ఉత్తమ దర్శకుడు-స్మైల్ ప్లీజ్ (హిందీ) చిత్రానికి బకువల్ మతియాని,,కుటుంబ విలువలపై ఉత్తమ చిత్రం-చాంద్ సాన్సే (హిందీ),,ఉత్తమ సినిమాటోగ్రాఫర్-పటాల్ టీ (భోటియా) చిత్రానికి బిట్టు రావత్,,ఉత్తమ పరిశోధనాత్మక చిత్రం-లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్),,ఉత్తమ ఎడ్యూకేషన్ చిత్రం-సిర్పిగాలిన్ సిపంగల్ (తమిళం),,సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం-మిథు ది (ఇంగ్లీష్), త్రీ టూ వన్ (మరాఠీ & హిందీ),,ఉత్తమ పర్యావరణ చిత్రాలు- మున్నం వలవు (మలయాళం)..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *