AMARAVATHIDISTRICTSHEALTH

బర్డ్ ఫ్లూ వ్యాధితో కోళ్లు చచ్చిపోతున్నాయి-చనిపోయిన కోళ్లను భూమిలో పాతి పెట్టాలి-కలెక్టర్

కోళ్లకు ఇన్ఫ్లో ఎంజా వ్యాధి..

నెల్లూరు: జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి( AVIAN  INFLUENZA) వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు.గురువారం క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో బర్డ్ ఫ్లూ నివారణపై జిల్లా కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలకుండా అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. పొదలకూరు మండలం చాటగుట్ల, కోవూరు మండలం గుమ్మళ్ళదిబ్బ గ్రామాలలో ఇటీవల ఇన్ఫ్లుఎంజా వ్యాధి తో కోళ్లు పెద్ద ఎత్తున చనిపోవడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు భోపాల్ లోని టెస్టింగ్ కేంద్రానికి పంపారని ఇన్ఫ్లో ఎంజా నిర్ధారణ కావడంతో, వ్యాధి ప్రబలకుండా అదుపు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల ప్రకారం, కోళ్లు మృతిచెందిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధి లో 3 రోజులపాటు చికెన్ షాపులు మూసివేయాలని ఒక కిలోమీటర్ పరిధిలో మూడు నెలల వరకు షాపులు తెరవకూడదని ఆ ప్రకారం సంభందిత అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యాధి సోకిన ప్రాంతం నుండి 15 రోజుల వరకు కోళ్లు బయటకు వెళ్లకూడదని, వేరే ప్రాంతం నుండి కోళ్లను తీసుకురాకూడదని అన్నారు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతి పెట్టాలన్నారు. కోళ్ల ఫాంలు,,ఆ కోళ్ల వద్ద పనిచేసే మనుషులు జాగ్రత్తగా ఉండాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి ,Z.P.CEO ఆ రెండు గ్రామాలలో శుక్రవారం ఉదయం MPDO,,POPRD వెటర్నరీ డాక్టర్, రెవిన్యూ ఇతర శాఖలో అధికారులతో కలసి గ్రామసభలు నిర్వహించి ప్రజలలో,కోళ్ల పెంపకం దారులలో,చికెన్ షాప్ యజ మానులలో అవగాహన తీసుకురావాలన్నారు. ఆయా గ్రామాల  పరిధిలో శానిటైజేషన్ చేయించాలన్నారు.వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *