ఖైదీల లైగింక వేధింపులపై కోర్టులు జ్యోకం చేసుకోవాలి-కవిత

నెల్లూరు: జిల్లా సెంట్రల్ జైలులో ఖైదీల పట్ల అధికారులు అమానుషంగా పవ్రర్తిస్తున్నరని,ఖైదీలను సంస్కరించాల్సి అధికారులు క్రూరంగా వ్యవహారిస్తున్న ఘటనలపై హైకోర్టు,ఈ సంఘటనలు సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని ఖైదీల కుటుంబ సభ్యుల సంక్షేమ సమితి జిల్లా కార్యదర్శి కవిత డిమాండ్ చేశారు.సోమవారం ఖైదీల కుటుంబ సభ్యులతో కలసి,జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందచేశారు.అనంతరం అమె మీడియాతో మాట్లాడుతూ సూపరింటెండెంట్ గా పనిచేసిన రవికిరణ్,, ASP మహేష్ బాబు,డిప్యూటీ జైలర్ దుర్యోధనలు,ఖైదీలను శరిరీకంగా,మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నరని చెప్పారు. సూపరింటెండెంట్ గా పనిచేసిన రవికిరణ్, వెంకటేశ్వర్లు అనే ఖైదీ పట్ల ఒక రకంగా లైగింక దాడికి పాల్పపడ్డాడని అరోపించారు.జిల్లా సెంట్రల్ జైలులో జరుగుతున్న దారుణలపై CB CID పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇచ్చినప్పటికి, రవికిరణ్ పై ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.