AMARAVATHIPOLITICS

అధికారంలో వస్తే,పాత ధరలకే మద్యం విక్రయాలు-వపన్

అమరావతిం అధికారంలో వున్న పాలకులు ఇష్టరాజ్యంగా చట్టాలు చేస్తే,వ్యవస్థలో తిరుగుబాటు వస్తుందని,,అలాగే  సంపూర్ణ మద్యపాన నిషేధం సాధ్యపడదని, జనసేన అధికారంలోకి వస్తే మళ్లీ పాత ధరలకే మద్యం విక్రయాలు చేపడతామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు..శుక్రవారం వారాహి యాత్రలో భాగంగా భీమవరం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు..ఇదే సమయంలో మహిళలు కోరుకుంటే ఆయా ప్రాంతాల్లో కచ్చితంగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామన్నారు.. మద్యపాన నిషేదం పేరిట వైసీపీ ప్రభుత్వం జనాలను మోసం చేసి,,వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని వచ్చిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వ మద్యం ధరలు బాగా పెంచి ఒక వర్గం ప్రజలను దొచుకుందని విమర్శించారు. కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారని,,దింతో ఎంతో మంది ఆసుపత్రుల పాలైయ్యారని మండిపడ్డారు..దశాబ్దకాలంగా ప్రజాసమస్యలపై జనసేన పోరాటం చేస్తునే వున్నదని,,ఈ పోరాటంలో గెలుపు, ఓటమి ఉండదు…ప్రయాణమే ఉంటుందన్నారు.. యువతకు 2.50 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు.. వైసీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెడుతోందని,, కులం పేరు పెట్టుకునే వ్యక్తికి క్లాస్ వార్ గురించి మాట్లాడే అర్హత లేదని,,కేవలం ఒక్క కులమే అధికారం చేయాలనుకోవడం తప్పు” అని పవన్ కల్యాణ్ అన్నారు..”భీమవరంలో నేను ఓడిపోయినట్లు అనిపించడం లేదు.. పదేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నా… వైసీపీ నడుపుతున్న దోపిడీ వ్యవస్థపై పోరాడుతున్నాం…యువత కోసం వైసీపీ ఏం చేసిందని నిలదీశారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *