AMARAVATHITECHNOLOGY

రెండు రోజుల్లో ల్యాండర్, రోవర్ ను స్లీప్ మోడ్ లోకి-ఇస్రో ఛైర్మన్ సోమనాథ్

చంద్రుడి దక్షిణ ధృవంపై లూనార్ నైట్..
అమరావతి: చంద్రయాన్-3 ల్యాండ్ అయిన చంద్రుడి దక్షిణ ధృవంపై లూనార్ నైట్(రాత్రి) ప్రారంభం కానున్నది.. ఇది 14 రోజులు కొనసాగుతున్న సమయంలో చంద్రుడి దక్షిణ ధృవం వద్ద ఉష్టోగ్రతలు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి..లూనార్ నైట్ సమయంలో అక్కడ సూర్య రశ్మి ఉండదు..దీంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ పని చేసేందుకు విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్యానల్స్ పని చేయవు..ఇలాంటి సమయంలో ల్యాండర్, రోవర్ ను స్లీప్ మోడ్ లో ఉంచేందుకు మరో రెండు రోజుల్లో ఇస్రో శాస్త్రవేత్తలు చర్యలు చేపడతారని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.. అలాగే రోవర్ ఇప్పటి వరకు చంద్రుడి ఉపరితలంపై సుమారు 100 మీటర్ల దూరం ప్రయాణించిందని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *