తెలుగు రాష్ట్రల్లోని వ్యాపార, రాజకీయ నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలు

హైదరాబాద్: తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లోని పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల ఇళ్లల్లో మంగళవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడల్లో వేర్వేరు ఐటీ బృందాలు సోదాలు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.జూబ్లీహిల్స్, నందగిరి హిల్స్ పరిధిలో ఉన్న వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి నివాసంతోపాటు, అతడి కార్యాలయం, బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.సుబ్బారెడ్డి బావ మరిది జనార్ధన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.రెండు రాష్ట్రాల్లో కలిపి 36 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్:- గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.వంశీకి సంబంధించి మూడు వేరు వేరు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.అలాగే విజయవాడ పరిధిలోని వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అవినాష్ బంజారాహిల్స్ లోని తన భూమిని డెవలప్‌మెంట్ కోసం వంశీరాం బిల్డర్స్‌కు ఇచ్చాడు.