కళ్లు నెత్తికెక్కిన కాకాణికి రైతులెక్కడ కనిపిస్తారు-సోమిరెడ్డి

నెల్లూరు: రైతు వ్యతిరేక జగన్ రెడ్డి ప్రభుత్వంపై నిరంతర పోరాటం సాగుతుందని,,ఒక్క అనంతపురంలోనే కాదు..రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో మోటార్లకు మీటర్లు బిగించినా రైతులే పెరికేస్తారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.శుక్రవారం అయన వీడియో విడుదల చేశారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ మోటార్లకు మీటర్లు వద్దన్నా ఈ తుగ్లక్ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు….ఫలితంగా రైతులు రోడ్డెక్కడం చూస్తున్నాం..నిన్న అనంతపురం జిల్లాలోనూ మోటార్లకు బిగించిన మీటర్లను పెరికేసి రోడ్లపైకి లాక్కురావడం చూశాం..రైతుల గోడు పట్టించుకోకుండా మోటార్లకు మీటర్లు పెడితే ఒక్క అనంతపురమే కాదు…రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా ఇదే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు.. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి నెలలు గడుస్తున్నానగదు రాక, వడ్డీలు పెరిగిపోయి రైతులు అల్లాడుతున్నారు..ముందు వారిని ఆదుకోండి.. మనుబోలు రైతుపోరును చూశాక కాకాణికి నిద్రపట్టినట్టు లేదు..సభలో రైతులే లేరని కాకమ్మ కథలు చెబుతున్నారు..కళ్లు నెత్తికెక్కిన ఆయనకు రైతులకెక్కడ కనిపిస్తారంటూ ఎద్దేవా చేశారు..