AMARAVATHIPOLITICS

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A-14గా నారా లోకేష్

అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A-14గా నారా లోకేష్ పేరును CID చేర్చింది..ACB కోర్టులో లోకేష్ పేరును మెన్షన్ చేస్తూ CID మెమో దాఖలు చేసింది..IRR (ఇన్నర్ రింగ్ రోడ్డు) అలైన్ మెంట్ స్కామ్ లో ఇప్పటికే చంద్రబాబుపై CID కేసు నమోదు చేసింది..నేడు లోకేష్ పేరును కూడా చేర్చడంతో రాష్ట్రంలో హట్ టాఫిక్ గా మారింది..ఇన్నరింగ్ రోడ్ అలైన్మంట్ లో మార్పులు చేసి,నారా.లోకేష్ లబ్దిపొందాలని ప్రయత్నించారని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది..క్విడ్ ప్రోకో క్రింద లింగమనేని.రమేష్ కుటుంబానికి భారీగా ప్రయోజనం కల్పించారనే ఆరోపణలు లోకేష్ పై వున్నాయి..స్కిల్ డెవలెప్ మెంట్ స్వామ్,,ఫైబర్ నెట్ కేసులో లోకేష్ నిందితుడిగా వున్నాడు..ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో ఏ-3గా లింగమనేని రమేష్ వున్నారు.ఫైనల్ అలైన్ మెంట్ అనుకుని లింగమనేని కుటుంబానికి 168.45 ఎకరాలు వున్నాయి..ఈ కేసులో మాజీ మంత్రి నారాయణతో పాటు మరికొందరిపైనా అభియోగాలు ఉన్నాయి..తదుపరి అరెస్ట్ నారా లోకేష్ దేనా అనేది చర్చనీయాంశంగా మారింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *