Close

పాక్ ఆక్రమిత కశ్మీర్ ను సమయం వచ్చినప్పుడు వెనక్కు-రాజ్‌నాథ్ సింగ్

పాక్ ఆక్రమిత కశ్మీర్ ను సమయం వచ్చినప్పుడు వెనక్కు-రాజ్‌నాథ్ సింగ్
  • PublishedNovember 30, 2022

అమరావతి: పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ కు చెందినదని, సమయం వచ్చినప్పుడు తిరిగి తెచ్చుకుంటామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. బుధవారం ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను వెనక్కి తెచ్చుకోవడంతో పాటు భారత ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేసేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని నార్తరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది  ఇటీవల స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.అక్టోబరు 27వ తేదిన శ్రీనగర్‌లో జరిగిన ఇన్‌ఫ్రాంట్రీ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, POKలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దీనికి పాక్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.పాక్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న కశ్మీర్‌ భూభాగాలను వెనక్కి తెచ్చుకోవాలంటూ 1994లో పార్లమెంటు ఆమోదించిన తీర్మానాన్ని అమలు చేసేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published.