INTERNATIONAL

అమెరికా వాల్ మార్ట్ స్టోర్ లో కాల్పులు-14 మంది మృతి

అమరావతి: అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్,, ప్రజలకు ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తొంది.ఏ నిమిషంలో ఎటు వైపు నుంచి బుల్లెట్లు దూసుకుని వస్తాయో తెలియని పరిస్థితి అగ్రరాజ్యం తాండవిస్తొంది.ఈనేపధ్యంలో మంగళవారం వర్జీనియాలోని చీసాపీక్లోని శామ్ సర్కిల్ వద్ద ఉన్న వాల్ మార్ట్ స్టోర్ లో కాల్పులు కలకలం రేపాయి. వాల్ మార్ట్ లో పని చేస్తున్న స్టోర్‌ మేనేజర్‌ బ్రేక్‌ రూంలోకి వెళ్లి అక్కడున్నవారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 35 నుంచి 40 నిమిషాల పాటు కాల్పులు జరిగాయన్నారు. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య 14కి చేరగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాల్పుల అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో వాల్‌మార్ట్‌ తెరిచే ఉందని యూఎస్ పోలీసులు తెలిపారు. వాల్‌మార్ట్‌ స్టోర్‌ దగ్గరకు భారీ సంఖ్యలో అంబులెన్సులు, పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బుల్లెట్ల వర్షం కురిపించడంతో పబ్లిక్ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి భయంతో పరుగులు పెట్టారు. అమెరికాలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ గన్‌ కల్చర్‌కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *