AMARAVATHINATIONAL

భారీవర్షాలు కారణంగా అతలాకుతలం అవుతున్న దక్షణ తమిళనాడు

అమరావతి: దక్షణ తమిళనాడు భారీవర్షాలు కారణంగా అతలాకుతలం అవుతొంది..కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్ ఖాసి జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిశాయి..ఆదివారం అర్థరాత్రి నుంచి దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నే వున్నాయి.. ప్రస్తుతం కొమోరిన్,, దాని పరిసర ప్రాంతాలపై తుపాను ప్రభావం ఉందని,, ఇది మధ్య-ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించి ఉందని ఐఎండీ అదికారులు వెల్లడించారు..
నాలుగు జిల్లాల్లో ఆదివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి..భారీ వర్షాల కారణంగా సోమవారం అన్ని విద్యాసంస్థలకు శెలవు ప్రకటించారు..రైలు పట్టాలపైకి వరదనీరు ప్రవేశించడంతో పలు రైళ్లు పూర్తిగా రద్దు చేశారు..టుటికోరిన్ జిల్లాలోని తిరుచెందూర్ లో సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల వరకు 606 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది..నాలుగు జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా వీడియో కాన్ఫరెన్స్ లో సమావేశమై,, వరదల పరిస్థితిని అధిగమించేందుకు తగిన నివారణ చర్యలు తీసుకోవాలని అదేశించారు..కన్యాకుమారి, తిరునెల్వేలిలో రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాల సహాయ చర్యలు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్:- నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని,, సముద్రంపై నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది..ఈ ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒ మోస్తురు వర్షాలు కురిసే అవకాశం వున్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు..ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని,,రాబోయే 24 గంటల్లో నెల్లూరు,, అన్నమయ్య,, చిత్తూరు,, శ్రీసత్యసాయి,, బాపట్ల,, గుంటూరు,, ప్రకాశం,, తిరుపతి,, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *