ఘనంగా ప్రారంభమైన హర్ ఘర్ కా తిరంగా ర్యాలీ

దేశభక్తి,జాతీయ భావం..
నెల్లూరు: దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ప్రజల్లో దేశభక్తి భావం, జాతీయ పతాకం పట్ల అవగాహన పెంపొందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ పేర్కొన్నారు.సోమవారం ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం సందర్బంగా స్థానిక గాంధీ బొమ్మ వద్ద గాంధీజీ విగ్రహానికి అరుణమ్మ, ZPCEO శ్రీమతి.వాణి,,DPO శ్రీమతి ధనలక్ష్మి, తదితరులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు., అనంతరం ఏర్పాటుచేసిన ర్యాలీని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ జెండా ఊపి ప్రారంభించారు.