AMARAVATHIINTERNATIONAL

ఎన్నికల్లో గెలిచేందుకు ముయిజ్జు మాల్దీవుల ప్రజలను తప్పుదారి పట్టించారు-అబ్దుల్లా షాహిద్

అమరావతి: ఎన్నికల్లో గెలిచేందుకు ముయిజ్జు మాల్దీవుల ప్రజలను తప్పుదారి పట్టించారని,,తమ దీవుల్లో వందలాది మంది భారత సైనికులు ఉన్నారన్న అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు చేసిన వ్యాఖలు వట్టి అబద్ధాలేనని మాల్దీవుల విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ మండిపడ్డారు..తమ దేశంలో సాయుధులైన విదేశీ సైనికులెవరూ లేరని,,ఎన్నికల సమయంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించలేకే ముయిజ్జు ఇలాంటి అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు.. ఆయన 100 రోజుల పాలనలో అనేక అబద్ధాలను ప్రచారం చేశారని,, అందులో ఇదీ ఒకటని సోషల్ మీడియాలో పేర్కొన్నారు..గతంలో అధికారంలో ఉన్న మాల్దీవియన్‌ డెమొక్రటిక్‌ పార్టీ (MDP) వల్లే అనేక మంది భారత సైనికులు దేశంలోకి ప్రవేశించారని ఎన్నికల సమయంలో మయిజ్జు విషప్రచారం చేశారు..ఇదే నినాదంతో ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేశారని MDP విమర్శించింది..అయితే భారత్‌తో అలాంటి ఒప్పందాలు కుదిరినట్లు అధికారంలోకి వచ్చాక నిరూపించలేకపోతున్నారని అబ్దుల్లా షాహిద్ వ్యాఖ్యనించారు..ప్రజల విశ్వాసం కోల్పోతామనే భయంతోనే ఇప్పటికి ముయిజ్జు అదేపనిగా అబద్ధాలు చెబుతున్నరని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *