AMARAVATHI

రత్నాచల్‌ ఎక్స్‌ ప్రెస్‌ దగ్దం ఘటనలో 41 మందిపై పెట్టిన కేసును అక్రమ కేసులే-రైల్వే కోర్టు

అమరావతి: గతంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు హామీ నెరవేర్చనందుకు నిరసనగా జరిగిన రైల్ రొకో సందర్బంగా తుని రైలు దగ్ధం ఘటనపై విజయవాడ రైల్వే కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది..ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులు లోతైన విచారణ చేయలేదని,,వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది..సున్నితమైన అంశాన్ని 5 సంవత్సరాల పాటు ఎందుకు సాగదీశారని కోర్టు ప్రశ్నించింది..24 మంది సాక్షుల్లో 20 మందిని రైల్వే కోర్టు విచారించింది..ఈ కేసులో పోలీస్ ఉన్నతాధికారులపై ఎందుకు చర్యలు తీసుకో కూడదో వివరణ ఇవ్వాలని కోరింది..రైలు దహనం కేసుపై ముద్రగడ,దాడిశెట్టి.రాజా,నటుడు జీవీతో సహా 41 మందిపై అప్పట్లో రైల్వే పోలీసులు అభియోగాలు నమోదు చేశారు..ఆధారాలు లేని కారణంగా కేసులో నిందితులుగా ఉన్న 41 మందిపై పెట్టిన కేసును అక్రమ కేసుగా పరిగణిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది.

(టీడీపీ అధికారంలోకి వస్తే, కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది..టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత హామీని నెరవేర్చడంలో విఫలం కావడంతో కాపులు ఉద్యమించారు..2016లో తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన రైలు రోకో సందర్భంగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సహా పలువురు కాపు ఉద్యమ నేతల పిలుపు మేరకు ఆందోళనలు జరిగాయి..ఈ క్రమంలో ఉద్యమంలోకి కొంతమంది ఆసాంఘిక శక్తులు ప్రవేశించి తుని రైల్వే స్టేషన్ సమీపంలో రత్నాచల్‌ ఎక్స్‌ ప్రెస్‌ను తగులబెట్టారు.)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *