AMARAVATHINATIONAL

గొర్రె పిల్లకు ఏకంగా రూ.కోటి రూపాయలు ధర

అమరావతి: రాజస్ధాన్ లోని తారానగర్లో నివాసం వుంటున్న రాజు సింగ్ అనే వ్యక్తి పెంచుకుంటున్న గొర్రె పిల్లకు ఏకంగా రూ.కోటి రూపాయలు ధర పలికింది..ఇందుకు రాజు సింగ్ సదరు గొర్రెపిల్లను అమ్మేందుకు నిరాకరించడంతో ఈ ఉదతం చుట్టు ప్రక్కల గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది..విషయంలో వస్తే… సదరు గొర్రె పొట్టపై ఇస్లాంలో పవిత్రంగా భావించే 786 అనే నెంబర్ అకారం కన్పిస్తొంది..కొందరు ముస్లింలు తనను కలిసిన మీదట గొర్రెపై 786 నెంబర్లు రాసిఉన్నాయని అతడికి తెలిపారు..ఈద్ సందర్బంగా తమకు ఇది ఎంతో ముఖ్యమని తెలిపారు..అయితే ముస్లింలకు తన గొర్రె పిల్ల ఎంత ముఖ్యమైనదైనా,, దానితో తన అనుబంధం ఎంతో విలువైనదని, దాన్ని విక్రయించేందుకు తాను సుముఖంగా లేనని రాజు సింగ్ వారికి స్పష్టం చేశాడు.. గత ఏడాది గొర్రె పిల్ల జన్మించిందని, స్ధానికులు దీనికి వేలం నిర్వహించగా కొందరు రూ.70 లక్షలు చెల్లిస్తామని ముందుకొచ్చినా అమ్మేందుకు తాను సిద్ధంగా లేనని సింగ్ చెప్పాడు.. గొర్రె పిల్లకు దానిమ్మ, పప్పాయ, మిల్లెట్స్, కూరగాయలను ఆహారంగా అందిస్తున్నాడు..గొర్రె పిల్లకు భారీ ధర పలకడంతో ముందు జాగ్రత్తగా గొర్రె పిల్లను అతడు తన ఇంటి నుంచి బయటకు రాకుండా చూసుకుంటున్నాడు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *