AMARAVATHINATIONAL

ఈడీ అధికారులపైనే క్రేజీవాల్ గూఢచర్యం ?

అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో  అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో బయటపడిన కొన్ని డాక్యూమెంట్స్ ను చూస్తుంటే,,క్రేజీవాల్,ఓ క్రిమినల్ లా వ్యవహరించినట్లు తెలుస్తొంది.? కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో 150 పేజీలతో కూడిన ఓ డాక్యుమెంట్ లభ్యమైందని, దాని ప్రకారం ఆయన ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్  అధికారులపైనే గూఢచర్యం చేశారని సంబంధిత వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం..ఆ డాక్యుమెంట్‌లో ఈడీలోని ఇద్దరు ఉన్నత అధికారుల గురించి కీలక సమాచారం ఉందని సంబంధిత దర్యప్తు సంస్థ వర్గాలు తెలిపాయి..ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే,, కేజ్రీవాల్‌పై గూఢచర్యం కేసు నమోదు కావచ్చు..

ప్రత్యేక డైరెక్టర్-ర్యాంక్ అధికారి, జాయింట్ డైరెక్టర్-ర్యాంక్ అధికారికి సంబంధించిన సున్నితమైన వివరాలు అందులో ఉన్నాయని,, భద్రతా కారణాల దృష్ట్యా వారి పేర్లను బయటపెట్టలేదని తెలియవచ్చింది..ఆ పత్రంలో పేరున్న జాయింట్ డైరెక్టర్-ర్యాంక్ అధికారి,, ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తుని పర్యవేక్షిస్తున్నారు..ఈ డాక్యుమెంట్ గురించి కేజ్రీవాల్ రిమాండ్ నోట్‌లో కూడా ప్రస్తావించించారు..

ఈ కేసులో కేజ్రీవాల్ ‘కింగ్‌పిన్’ అని, కొందరు వ్యక్తులకు మేలు చేసేందుకు లంచం అడిగారని రౌస్ అవెన్యూ కోర్టుకు శుక్రవారం ఈడీ వెల్లడించింది..మద్యం విధానం రూపకల్పనలో కేజ్రీవాల్‌కు ప్రత్యక్ష పాత్ర ఉందని,,ఈ కేసులో సహ నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే.కవిత వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నామని ఈడీ పేర్కొంది..లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగంగా ఎమ్మెల్సీ కవితను కేజ్రీవాల్ కలిశారని, కలిసి పని చేద్దామంటూ చెప్పారని ఈడీ కోర్టుకు తెలిపింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *