AMARAVATHICRIMENATIONAL

ఎర్నాకులంలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో పేలుడు,ఒకరు మృతి,50 మందికి గాయాలు

అమరావతి: కేరళలోని ఎర్నాకులం జిల్లా జమ్రా ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో పేలుడు ఘటన చోటు చేసుకుంది..ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో 50 మందికి గాయాలు అయ్యాయి..పేలుడు ఘటన జరిగిన ప్రదేశంలోని చుట్టు పక్కల జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు.. ఆదివారం కలమస్సేరి నెస్ట్ సమీపంలోని కన్వెన్షన్ సెంటర్ లో క్రిస్టియన్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు..ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల మండలాలైన వరపుజ, అంగమలి, ఎడపల్లి నుంచి దాదాపు 2 వేల మంది వరకు ప్రజలు వచ్చారు..ఉదయం 9.30 గంటల సమయంలో కన్వెన్షన్ హాల్ మధ్యలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది..మరికొన్ని క్షణాల్లోనే అదే హాల్ లో మరో మూడు చిన్నపాటి పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలికి చేరకుని,, సహాయక్య చర్యలు చేపట్టి క్షతగాత్రులను చికిత్స కోసం కలమస్సేరి మెడికల్ కాలేజీకి తరలించడం జరిగిందని ఎర్నాకులం కలెక్టర్ ఉమేష్ తెలిపారు..కన్వెన్షన్ సెంటర్ లో లోపలి వైపు నుంచి తాళం వేసి ఉండటంతో క్షతగాత్రులను బయటికి తీసుకురావడంతో ఆలస్యమైందని పోలీసులు పేర్కొన్నారు.. జరిగిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *