AMARAVATHIHYDERABAD

తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం పర్వం- ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్

హైదరాబాద్: తెలంగాణలో నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసిందని,,ఇక ఎలాంటి ప్రచారానికి వీలు లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ స్పష్టం చేశారు.. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ పార్టీలు ఎటువంటి సమావేశాలు నిర్వహించరాదని హెచ్చరించారు..”స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లి పోవాలన్నారు”. సినిమాలు, సోషల్ మీడియా, టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్ వర్క్ ల్లో ప్రచారం నిషిద్ధమని వెల్లడించారు.. అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్ మీడియాలో అవకాశం ఉందన్నారు.. ప్రచారానికి సంబంధించి ఎలాంటి ప్రదర్శనలు కూడదన్నారు.. పోలింగ్ ముగిసిన అరగంట తరువాత దాకా ఎగ్జిట్ పోల్స్ నిషేధమని,,అలాగే ఓటరు స్లిప్పుల్లో పార్టీల గుర్తులు, అభ్యర్థుల పేర్లు ఉండకూడదన్నారు.. పోలింగ్ స్టేషన్లకు మొబైల్ అనుమతి లేదని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు.
ప్రవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి:- 30వ తేదిన తెలంగాణలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని ఎన్నికల ప్రధాన అధికారి చెప్పారు..ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ఇవ్వాలని,,సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *