AMARAVATHINATIONAL

నేపాల్ లో భూకంపం 128 మంది మృతి,140కి పైగా గాయాలు,ఆస్తి నష్టం?

అమరావతి: నేపాల్ లో శుక్రవారం రాత్రి 11.40 నిమిషాలకు భారీ భూకంపం సంభవించింది.. నేపాల్ దేశంలోని జాజర్ కోట్ జిల్లాలో సంభవించిన భారీ భూప్రకంపనల కారణంగా ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 128 మంది మరణించారు..భూకంపం వల్ల 140 మందికి పైగా గాయపడ్డారు..వీరి సంఖ్య ఇంక పెరిగి అవకాశం వుంది..
భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైందని అధికారులు తెలిపారు..జాజర్ కోట్ జిల్లాలోని లామిదండా ప్రాంతంలో భూమికి 18 కిలోమీటర్ల అడుగున భూప్రకంపనల కేంద్రం ఉన్నట్లు జియోలాజికల్ సర్వే వెల్లడించింది.. భూకంప కేంద్రానికి 676 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశ రాజధాని న్యూఢిల్లీ,,బీహర్,,యూపీలో వరకు భూ ప్రకంపనలు సంభవించాయి..
నేపాల్ లో తరుచూ భూకంపలు ఎందుకు ? :- నేపాల్ దేశంలోని భూమి క్రింద ఒక ప్రధాన భౌగోళిక లోపం ఉంది.. భారతీయ టెక్టోనిక్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ లోకి నెట్టి హిమాలయాలను ఏర్పరుస్తుంది..దీని కారణంగా భూకంపాలు సంభవించడం సర్వ సాధారణంగా జరుగుతుంది..
2015వ సంవత్సరంలో నేపాల్ లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 12000 వేల మందికి పైగా మరణించగా,,10 లక్షల ఇళ్లు,,భవనాలు దెబ్బతిన్నాయి..2023 అక్టోబర్ 3వ తేదీన 6.2 తీవ్రతతో సంభవించిన భూ ప్రకంపనల కాణంగా 334 ఇళ్లు ధ్వసం కాగా 1,115 మంది గాయపడ్డారు..ఈ ప్రకంపనలు Delhi-NCR ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో సంభవించాయి..2022 నవంబరులో నేపాల్ లోని దోటి జిల్లాలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించి ఆరుగురు మరణించారు..
భూకంప మృతులకు నేపాల్ ప్రధాని పుష్పకమల్ సంతాపం తెలిపారు.. క్షతగాత్రులను తక్షణమే రక్షించేందుకు,, సహాయ కార్యక్రమాలు వేగంగా చేపట్టేందుకు దేశంలోని మూడు భద్రతా ఏజెన్సీలను ఏర్పాటు చేసినట్లు నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ కార్యాలయం తెలిపింది.. భూకంప ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ప్రభుత్వం భద్రతా బలగాలను మోహరించింది..భూకంపం వల్ల భారీ ఆస్తి నష్టం సంభవించిందని నేపాల్ దేశ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి నారాయణ్ ప్రసాద్ భట్టారాయ్ తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *